Andhra Pradesh: ఏపీలో మరో 81 మందికి కరోనా నిర్ధారణ.. కృష్ణా జిల్లాలో కొత్తగా 52 మందికి సోకిన వైనం

coronavirus cases in ap
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 81 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. కర్నూలులో కొత్తగా 4, గుంటూరులో 3, కడపలో 3, అనంతపురంలో 2, తూర్పు గోదావరి జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 52, ప్రకాశం జిల్లాలో 3, పశ్చిమ గోదావరిలో 12 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో విజయనగరంలో మాత్రమే ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  మొత్తం 1,097కి చేరింది. కర్నూలులో అత్యధికంగా 279, గుంటూరులో 214 కరోనా కేసులు నమోదయ్యాయి.

కాగా, ఏపీలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 31కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 835గా ఉంది. 231 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  

ఏయే జిల్లాల్లో ఎంత మందికి కరోనా?

                                                       
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
COVID-19
Krishna District

More Telugu News