Rajasthan High Court: ఆన్ లైన్ విచారణ సందర్భంగా సివిల్ దుస్తుల్లో కనిపించిన న్యాయవాది.. జడ్జి ఆగ్రహం!

  • లాక్ డౌన్ నేపథ్యంలో న్యాయస్థానాల ఆన్ లైన్ విచారణ 
  • రాజస్థాన్ హైకోర్టు విచారణలో ఘటన
  • ఆగ్రహంతో విచారణ వాయిదా వేసిన జడ్జి
Lawyer appeared with civil dress as Judge got anger

కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ప్రకటించడంతో సుప్రీం కోర్టు సహా అన్ని కోర్టులు ఆన్ లైన్ విచారణ చేపడుతున్నాయి. అయితే రాజస్థాన్ హైకోర్టు ఓ బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఆన్ లైన్ విచారణ జరుపుతుండగా, న్యాయవాది సాధారణ దుస్తుల్లో దర్శనమివ్వడంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్ లైన్ విచారణ అయినా సరే లాయర్ యూనిఫాం ధరించే రావాలని స్పష్టం చేశారు.

అంతేకాదు, ఆ న్యాయవాది నల్లకోటు ధరించి విచారణకు హాజరు కాలేదన్న కారణంతో సదరు విచారణను వాయిదా వేస్తున్నట్టు జడ్జి ప్రకటించారు. కిందటి నెలలో ఇలాంటిదే ఓ ఘటన జరగడంతో, రాజస్థాన్ హైకోర్టు అందరు లాయర్లు సరైన యూనిఫాం ధరించాలంటూ నోటీసులు జారీ చేసింది.

More Telugu News