Corona Virus: పాదాలపై దద్దుర్లా.. అది కూడా కరోనా వైరస్ లక్షణం కావచ్చంటున్న డాక్టర్లు!

Rashes on feet could be sign of Covid19
షార్ట్స్‌లో చూడండి
పొడి దగ్గు, విపరీతమైన జ్వరం, తలనొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు ఉన్న వారిని కరోనా వైరస్ అనుమానితులుగా భావిస్తున్నారు. అయితే, ఈ మధ్య ఎలాంటి లక్షణాలు లేకున్నా కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ విషయంలో వైద్యులు తాజాగా మరో లక్షణాన్ని గుర్తించారు.

 పాదాలపై దద్దుర్లు  ఉన్నా కరోనా సోకిందని అనుమానించొచ్చని చెబుతున్నారు. ఇటలీకి చెందిన ఓ అధ్యయనం ప్రకారం.. కరోనా వైరస్ సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరికి చర్మ సంబంధ సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. అంటే బాధితుల చర్మం మీద ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయి. దీన్ని ‘కొవిడ్ ఫీట్’ అంటారని అంటువ్యాధుల నిపుణుడు సుబ్రమణియం స్వామినాథన్ తెలిపారు.

‘ఇటలీలో దాదాపు 20 శాతం మంది బాధితులకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. ఫిన్లాండ్, స్పెయిన్, అమెరికా, కెనడాలోని వైద్యులు కూడా కరోనా బాధితుల్లో చర్మంపై ఎర్రటి మచ్చలు, దద్దుర్లు ఉన్నట్టు గుర్తించారు. మన దేశంలో కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాం’ అని ఆయన చెప్పారు.

కరోనా వైరస్‌ సోకిన వారిలో నొప్పితో కూడిన దద్దుర్లు  ఎక్కువగా పాదాలు, కాళ్ల బొటన వేళ్లతో పాటు కొన్నిసార్లు చేతులపై కూడా వస్తున్నాయి. ఇవి విపరీతమైన చలి ఉన్నప్పుడు కాలి వేళ్లు ఉబ్బినట్టుగా ఉంటాయి. దీనికి సంబంధించి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవలేదని అంటున్నారు. రెండు వారాల క్రితం దద్దుర్లతో పాటు విపరీతమైన జ్వరంతో  ఓ చర్మవ్యాధుల వైద్యుడి దగ్గరికి వచ్చిన దంపతులకు కరోనా సోకినట్టు గుర్తించారు.  ఒకవేళ దద్దుర్లతో పాటు ఎక్కువ జ్వరం ఉంటే వైరస్‌ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Go Back to Shorts
Corona Virus
new sign
rashes
on foot

More Telugu News