AirCooler: మహాభారత్ సీరియల్ లో భీష్ముడి వెనుక ఎయిర్ కూలర్... ఇట్టే పట్టేసిన వీక్షకులు!

Air cooler behind Bheeshma as Mahabharat serial was targeted satirical
షార్ట్స్‌లో చూడండి
కొన్ని దశాబ్దాల కిందట దూరదర్శన్ చానల్లో వచ్చిన మహాభారత్ సీరియల్ ఎంతో ప్రజాదరణ పొందింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆ సుదీర్ఘమైన సీరియల్ ను దూరదర్శన్ పునఃప్రసారం చేస్తోంది. అయితే, అప్పట్లో ఆ సీరియల్ లో ఎవరూ గుర్తించని తప్పులను నేటి తరం ప్రేక్షకులు ఈజీగా కనిపెట్టేశారు.

ఓ ఎపిసోడ్ లో భీష్ముడి పక్కన ఎయిర్ కూలర్ కనిపించగా, ప్రేక్షకుల ఇట్టే పట్టేశారు. సోషల్ మీడియాలో దీనిపై జోకులు పేలుతున్నాయి. ఈ సందర్భంగా నెటిజన్లు ఇంగ్లీషు టెలివిజన్ సీరిస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎపిసోడ్ లో జరిగిన తప్పిదాన్ని కూడా ప్రస్తావించారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కాఫీ కప్ కనిపించడం ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది. ఈ రెండింటిని కలిపి నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు గుప్పిస్తున్నారు.
Go Back to Shorts
AirCooler
Mahabharat
Bheeshma
Lockdown
Corona Virus

More Telugu News