Bill Gates: మోదీని ప్రశంసిస్తూ బిల్ గేట్స్ లేఖ!

  • ‘కరోనా’ నియంత్రణకు ప్రభుత్వ చర్యలపై ప్రశంసలు
  • మోదీని ప్రశంసిస్తూ లేఖ రాసిన బిల్ గేట్స్  
  • లాక్ డౌన్, హాట్ స్పాట్ కేంద్రాల గుర్తింపు.. వంటి చర్యలతో ప్రయోజనం  
Bill gates praises Modi

భారత్ లో ‘కరోనా’ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని అభినందిస్తూ ఓ లేఖ రాశారు. భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన లాక్ డౌన్, హాట్ స్పాట్ కేంద్రాల గుర్తింపు, వైరస్ బారినపడ్డ వారిని ఐసోలేషన్ కేంద్రాలకు, అనుమానితులను క్వారంటైన్ లో ఉంచడం వంటి చర్యలు ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు. ఈ సందర్భంగా ‘కరోనా’ బాధితులకు వైద్యుల సేవలను, ’ఆరోగ్య సేతు’ వంటి యాప్ లను అందుబాటులోకి తేవడాన్ని ఆయన కొనియాడారు.

More Telugu News