కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసుకున్న హిందీ 'జెర్సీ'
- షాహిద్ కపూర్ హీరోగా హిందీ 'జెర్సీ'
- తదుపరి షెడ్యూల్ చండీగఢ్ లో
- లాక్ డౌన్ కారణంగా రిలీజ్ డేట్ మారే ఛాన్స్
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. నాయకా నాయికల కాంబినేషన్లో వచ్చే ముఖ్యమైన సన్నివేశాలను 'చండీగఢ్'లో ప్లాన్ చేశారట. అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగు వాయిదా పడింది. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత 'చండీగఢ్'లోనే చిత్రీకరణ జరుపుతారట. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 28వ తేదీన విడుదల చేయాలని భావించారు. కానీ లాక్ డౌన్ కారణంగా విడుదల తేదీ మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.