కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలో ఏపీకి నాలుగో స్థానం
- ప్రతి పది లక్షల మందికి సగటున 331 పరీక్షలు
- దేశ సగటు 198
- రాష్ట్రంలో ఇప్పటిదాకా 16,550 మందికి కరోనా టెస్టులు
ఈ జాబితాలో అగ్రస్థానంలో వున్న రాజస్థాన్‌లో పది లక్షల జనాభాకు సగటున 549 పరీక్షలు చేస్తున్నారు. ఏడు కోట్ల జనాభా ఉన్న ఆ రాష్ట్రంలో ఇప్పటిదాకా 37,860 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. రెండో ర్యాంకులో నిలిచిన కేరళలో సగటున 485 మందికి పరీక్షలు చేయగా.. మొత్తంగా 16,475 మందికి టెస్టు చేశారు. మూడో స్థానంలో ఉన్న మహారాష్ట్రలో సగటు 446గా ఉండగా.. ఆ రాష్ట్రంలో ఇప్పటిదాకా 50,850 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు.