అత్యవసర ప్రయాణాలకు ఎమర్జెన్సీ పాసులు ఇవ్వనున్న ఏపీ పోలీసులు.. వివరాలు ఇవిగో!
- అత్యవసర పనులు ఉన్న వారికి ప్రయాణించే వెసులుబాటు
- పాసులు కావాల్సిన వారు పోలీసులకు పూర్తి వివరాలు సమర్పించాలి
- తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు
మెడికల్ ఎమర్జెన్సీ, సామాజిక సేవ కోసం వెళ్తున్న వారితో పాటు ఇతర అత్యవసర సేవల్లో ఉన్నవారికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని... అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసు శాఖ తెలిపింది. కేవలం అత్యవసరం ఉన్నవారు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించకోవాలని కోరింది.
అత్యవసర పాస్ లు కావాల్సిన వారు ఈ వివరాలను పోలీసులకు సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి పేరు, చిరునామా, ఆధార్ కార్డు వివరాలు, వాహనం నెంబర్, ప్రయాణికుల సంఖ్య, బయలుదేరే స్టార్టింగ్ పాయింట్, గమ్యస్థానం వివరాలు ఇవ్వాలి. ఈ వివరాలను పరిశీలించిన తర్వాత అవసరమైన వ్యక్తులకు అధికారులు పాసులు మంజూరు చేస్తారు. తప్పుడు వివరాలు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పాస్ కావాల్సిన వారు తమ వివరాలను జిల్లా ఎస్పీకి ఆ జిల్లా వాట్సాప్ నంబర్ కు లేదా ఈమెయిల్ కు పంపించాలి. జిల్లాల వారీగా వాట్సాప్ నంబర్, ఈమెయిల్ వివరాలు ఇవిగో..
.