వేడి నీళ్లతో స్నానం చేయండి.. హృద్రోగాలు, పక్షవాతానికి దూరంగా వుండండి: జపాన్ పరిశోధకులు
- 30 వేల మందిపై 20 ఏళ్ల పాటు అధ్యయనం
- హృద్రోగాల ముప్పు 28 శాతం తగ్గే అవకాశం
- పక్షవాత ముప్పు 26 శాతం తగ్గుతుందని గుర్తింపు
సుమారు 30 వేల మందిపై 20 ఏళ్ల పాటు అధ్యయనం చేసి ఈ విషయాన్ని గుర్తించారు. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏరోబిక్స్ చేయడం వల్ల కలిగే ఫలితాలతో సమానమని తెలిపారు. చన్నీళ్లతో స్నానం చేసే వ్యక్తులతో పోల్చితే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసే వారిలో పక్షవాత ప్రమాదం కూడా 26 శాతం తక్కువని తేల్చారు.