లేడీ ఓరియెంటెడ్ మూవీలో అనుపమ పరమేశ్వరన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లేడీ ఓరియెంటెడ్ మూవీలో అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran
  • అనుపమకు యూత్ లో క్రేజ్
  • తెలుగులో తగ్గిన అవకాశాలు 
  • కొత్త దర్శకుడి సినిమాలో ఛాన్స్  
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కి మంచి క్రేజ్ వుంది. ఇక్కడి యువ కథానాయకుల జోడీగా ఆడిపాడే పాత్రలను చేస్తూ ఆమె మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే ఇటీవల కాలంలో తెలుగులో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఆమె తమిళ .. మలయాళ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టింది.

ఈ నేపథ్యంలోనే తెలుగు నుంచి ఆమెకి ఒక అవకాశం వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కథ అంతా కూడా ఆమె చుట్టూనే తిరుగుతుందట. ఇది పక్కా లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా హనుమాన్ చౌదరి పరిచయం కానున్నాడు. గతంలో ఆయన రవిబాబు దగ్గర దర్శకత్వ శాఖలో 'అవును' సినిమాకి పనిచేశాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
Anupama Parameswaran
Hanuman Choudari
Tollywood

More Telugu News