Anupama: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అనుపమ కథానాయిక ప్రధాన చిత్రం
  • షేర్ తీసుకుంటున్న వెంకటేశ్ 
  • కథ సిద్ధం చేస్తున్న మారుతి
Anupama signs for a new flick

 *  మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటించడానికి అంగీకరించింది. నూతన దర్శకుడు హనుమాన్ చౌదరి దీనికి దర్శకత్వం వహిస్తాడు. ఇదిలావుంచితే, ప్రస్తుతం అనుపమ తమిళంలో రీమేక్ అవుతున్న 'నిన్ను కోరి' చిత్రంలో నటిస్తోంది.
*  వెంకటేశ్ కథానాయకుడుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తాజాగా 'నారప్ప' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. తన సోదరుడు సురేశ్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం వెంకటేశ్ పారితోషికం అంటూ ప్రత్యేకంగా తీసుకోకుండా, చిత్రం లాభాలలో షేర్ తీసుకునేలా ఒప్పందం చేసుకున్నాడట.
*  హీరో నాని, దర్శకుడు మారుతి కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందుతుందనీ, ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పని జరుగుతోందని తెలుస్తోంది.

More Telugu News