కరోనాపై పోరాటానికి భారత్‌కు అమెరికా సాయం
- 64 దేశాలకు అదనంగా 174 మిలియన్ డాలర్ల నిధులు
- ఇందులో భారత్‌కు రూ.21 కోట్లు కేటాయింపు
- ఇదివరకే వంద మిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించిన అగ్రరాజ్యం
కరోనాను ఎదుర్కొనేందుకు దేశ వైద్య రంగానికి ప్రధాని మోదీ రూ. 15 వేల కోట్ల నిధులు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ మొత్తాన్ని అదనపు ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు, ఐసీయూ బెడ్స్, మెడికల్ బెడ్స్, మెడికల్, పారా మెడికల్ వైద్య సిబ్బంది కోసం ఖర్చు చేస్తామని తెలిపారు.