కూలీలపై అమానుషానికి పాల్పడిన పోలీస్ డిస్మిస్... ఉన్నతాధికారి క్షమాపణలు!
- యూపీలోని బదౌన్ లో ఘటన
- కూలీలను మోకాళ్లపై నడిపించిన పోలీసులు
- విధుల నుంచి తొలగించామన్న నగర పోలీస్ చీఫ్
ఈ వీడియోలో తమ సిబ్బంది వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని అంగీకరించిన నగర పోలీస్ చీఫ్ ఏకే త్రిపాఠి, తాను క్షమాపణలు కోరుతున్నట్టు తెలిపారు. వలస కార్మికులను ఇలా నడిపించిన ట్రయినీ కానిస్టేబుల్ ను డిస్మిస్ చేశామని, మరో కానిస్టేబుల్ ప్రమేయంపై విచారణ జరిపిస్తున్నామని అన్నారు. పోలీసులు సంయమనం పాటించి, పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.