సింగర్ కనికకు రెండోసారి టెస్ట్.. కరోనా పాజిటివ్ ధ్రువీకరణ!
- మొదటి పరీక్ష ఫలితంపై కుటుంబ సభ్యుల అనుమానాలు
- రెండోసారి టెస్ట్ చేసి నిర్ధారించిన వైద్యులు
- ఆమె కుటుంబ సభ్యుల్లో 11 మందికి నెగిటివ్
కనిక కుటుంబ సభ్యుల్లో చాలా మందికి వైరస్ సోకలేదని తెలిసింది. మొత్తం 35 మంది శాంపిల్స్ సేకరించగా, అందులో 11 మందికి నెగిటివ్ అని తేలింది. మరో 24 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఇక, ఆసుపత్రిలో తనకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయలేదన్న కనిక ఆరోపణలను వైద్యులు కొట్టిపారేశారు.