Dhanush: కన్నడలోను 'అసురన్' రీమేక్ .. హీరోగా శివరాజ్ కుమార్

  • తమిళంలో హిట్ కొట్టిన 'అసురన్'
  • తెలుగు రీమేక్ గా 'నారప్ప'
  • జాకబ్ దర్శకత్వంలో కన్నడ రీమేక్  
Asuran Movie Remake

తమిళంలో ధనుశ్ హీరోగా చేసిన 'అసురన్' అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ధనుశ్ కెరియర్లోనే వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచింది. కథాకథనాల పరంగా .. కథానాయకుడి లుక్ పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. దాంతో ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఇతర భాషలకి చెందిన దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు.

తెలుగులో ఈ సినిమాను 'నారప్ప' పేరుతో రీమేక్ చేస్తున్నారు. వెంకటేశ్ కథానాయకుడిగా సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇక కన్నడలోను ఈ సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా ఈ రీమేక్ రూపొందనుందని అంటున్నారు. జాకబ్ దర్శకత్వంలో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

More Telugu News