కాలేజ్ ప్రొఫెసర్ గా .. మాఫియా డాన్ గా విజయ్
- విజయ్ తాజా చిత్రంగా 'మాస్టర్'
- కథానాయికగా మాళవిక మోహనన్
- మే నెలలో ప్రేక్షకుల ముందుకు
ఒక పాత్రలో కాలేజ్ ప్రొఫెసర్ గా .. మరో పాత్రలో మాఫియా డాన్ గా ఆయన నటన ఈ సినిమాకి హైలైట్ అవుతుందని అంటున్నారు. ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా, కరోనా వైరస్ భయాందోళనలను కలిగిస్తోంది. షూటింగులు .. విడుదల తేదీలు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో 'మాస్టర్' కూడా వాయిదా పడుతున్నట్టుగా సమాచారం. మే నెలలో విడుదల చేయాలనే నిర్ణయానికి ఈ సినిమా టీమ్ వచ్చినట్టుగా చెబుతున్నారు. మాళవిక మోహనన్ కథానాయికగా కనిపించనుండగా, విలన్ పాత్రను విజయ్ సేతుపతి పోషిస్తున్నాడు.