విలనిజం చూపించనున్న రమ్యకృష్ణ
- 'శివగామి' పాత్రతో విపరీతమైన క్రేజ్
- ఆ తరువాత ఆ స్థాయిలో పడని పాత్రలు
- ఈ సినిమాపైనే రమ్యకృష్ణ ఆశలు
సాయితేజ్ - దేవకట్టా కాంబినేషన్లో రూపొందనున్న ఈ సినిమాలో ఆమె ఈ తరహా పాత్రను పోషించనుంది. సాయితేజ్ - దేవ కట్టా కాంబినేషన్లో ఓ పొలిటికల్ డ్రామా నిర్మితం కానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ తో కూడిన పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నారట. శివగామి తరువాత రమ్యకృష్ణ చేసిన పాత్రలేవీ ఆ స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. అందువలన ఈ పాత్ర తన కెరియర్ ను మరింత ఊపుతో ముందుకు తీసుకెళుతుందని రమ్యకృష్ణ బలంగా నమ్ముతోందని అంటున్నారు.