కరోనా ఎఫెక్ట్.. చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ రద్దు
- ఈ నెల 2 నుంచి చెపాక్ స్టేడియంలో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్న సీఎస్‌కే
- కరోనా నేపథ్యంలో సెషన్స్ రద్దు చేసిన యాజమాన్యం
- సొంత నగరాలకు క్రికెటర్ల తిరుగు ప్రయాణం
అయితే, కరోనా నేపథ్యంలో కొన్ని రోజులగా ఖాళీ స్టేడియంలో చెన్నై జట్టు ప్రాక్టీస్ చేస్తోంది. కానీ, దేశంలో కరోనా రోజు రోజుకీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడగా.. చెన్నై యాజమాన్యం కూడా ప్రాక్టీస్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. దాంతో, ఆటగాళ్లంతా తమ సొంత ప్రదేశాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు.