కరోనా ప్రభావంతో కీలక నిర్ణయాలు తీసుకున్న సుప్రీంకోర్టు
- సోమవారం నుంచి ముఖ్యమైన కేసులే విచారణ
- న్యాయవాదులు, పిటిషనర్లు, ప్రతివాదులకు మాత్రమే అనుమతి
- కొన్నిరోజుల పాటు ఇలాగే కార్యకలాపాలు కొనసాగిస్తామన్న సుప్రీం
ఈ క్రమంలో సోమవారం నుంచి ముఖ్యమైన కేసులే విచారించాలని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. కోర్టు హాల్లోకి న్యాయవాదులు, పిటిషనర్లు, ప్రతివాదులకు మాత్రమే అనుమతి ఉంటుందని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ వెల్లడించారు. కోర్టుకు వచ్చేవారిని దృష్టిలో ఉంచుకుని ఈ జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. సోమవారం నుంచి ఈ జాగ్రత్త చర్యలు కొన్నిరోజుల పాటు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.