బిగ్ బాస్-4 హోస్ట్ మహేశ్ బాబు అంటూ జోరుగా ప్రచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్ బాస్-4 హోస్ట్ మహేశ్ బాబు అంటూ జోరుగా ప్రచారం

Is Mahesh Babu hosts BiggBoss season four
  • ఈ వేసవి తర్వాత బిగ్ బాస్ నాలుగో సీజన్
  • మహేశ్ బాబే హోస్ట్ అంటూ కథనాలు
  • అధికారికంగా వెలువడని ప్రకటన
తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పటికి మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ వేసవి తర్వాత నాలుగో సీజన్ ప్రారంభం కానుంది. అయితే ఈసారి ఎవరు హోస్ట్ గా చేస్తారన్న అంశం విపరీతమైన ఆసక్తి కలిగిస్తోంది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, బిగ్ బాస్-4 కార్యక్రమానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హోస్ట్ గా వ్యవహరిస్తాడంటున్నారు. అదే నిజమైతే రేటింగ్స్ పరంగా రికార్డులు బద్దలయ్యే అవకాశాలున్నాయి. టాలీవుడ్ లో మహేశ్ బాబు ఛరిష్మా అంతాఇంతా కాదు. ఇటీవల కాలంలో భారీ హిట్లతో ఈ సూపర్ స్టార్ దూసుకుపోతున్నాడు.

కాగా, బిగ్ బాస్ షో మొదటి సీజన్ లో ఎన్టీఆర్ తనదైన యాంకరింగ్ తో ఓ బెంచ్ మార్క్ సెట్ చేశాడు. రెండో సీజన్ లో నాని కూడా ఎక్కడా తగ్గకుండా అలరించాడు. ఇక మూడో సీజన్ విషయానికొస్తే సీనియర్ హీరో నాగార్జున పెద్దరికంతో షోను చివరివరకు ఆసక్తికరంగా నడిపించి మంచి మార్కులే కొట్టేశారు. ఇప్పుడందరి దృష్టి బిగ్ బాస్ నాలుగో సీజన్ పై పడింది.

సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బ్లాక్ బస్టర్ నమోదు చేసిన మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు మధ్యలో కాస్తంత విరామం ఇచ్చి బిగ్ బాస్-4లో హోస్ట్ గా వ్యవహరిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు బిగ్ బాస్ నాలుగో సీజన్ కు సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు కానీ, మహేశ్ బాబు హోస్ట్ చేసే అవకాశాలున్నాయంటూ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అటు, మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా రేసులో ఉన్నా, మహేశ్ బాబు పేరే కాస్త బలంగా వినిపిస్తోంది.
Mahesh Babu
BiggBoss-4
Realty Show
Tollywood
New Season

More Telugu News