సంప్రదాయ దుస్తులతో వచ్చిన మహిళను అనుమతించని ఢిల్లీ రెస్టారెంట్!
- వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్ చేసిన మహిళ
- రెస్టారెంట్ తీరుపై మండిపడ్డ నెటిజన్లు
- దిగొచ్చి క్షమాపణ చెప్పిన యాజమాన్యం
ఈ నెల 10వ తేదీ సాయంత్రం ఈ ఘటనను వీడియో తీసిన ఆమె తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ‘కైలిన్ అండ్ ఇవీ రెస్టారెంట్ వద్ద నాకు ఎదురైన అనూహ్య అనుభవం, వివక్ష ఇది. సంప్రదాయ దుస్తులు ధరించినందుకు నన్ను రెస్టారెంట్‌లోకి అనుమతించలేదు. ఇండియాలో ఓ రెస్టారెంట్ స్మార్ట్ క్యాజువల్స్‌కు అనుమతిస్తుంది కానీ, ఇండియన్ వేర్‌కు ఇవ్వదా? భారతీయులు గర్వంగా ఉండడానికి ఏం అవుతోంది?’ అని ట్వీట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారగా.. సంగీతకు నెటిజన్లు మద్దతు ప్రకటించారు. సదరు రెస్టారెంట్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. దాంతో, రెస్టారెంట్ యాజమాన్యం దిగొచ్చింది. జరిగిన ఘటనపై సంగీతకు క్షమాపణ చెప్పింది.