ఈసారి ట్రాన్సిట్ వారెంట్‌తో మెట్‌పల్లి వచ్చి.. లింగన్నను తీసుకెళ్లిన జమ్మూకశ్మీర్ పోలీసులు
- సైన్యం రహస్యాలు చేరవేస్తున్న వ్యక్తికి నగదు బదిలీ
- ఆరోపణలు ఎదుర్కొంటున్న కుస్తాపూర్ వాసి
- ట్రాన్సిట్ వారెంట్ లేకపోవడంతో గతంలో తిప్పి పంపిన కోర్టు
దీంతో ఈ నెల 3న జగిత్యాల వచ్చిన జమ్మూకశ్మీర్ పోలీసులు లింగన్నను అదుపులోకి తీసుకుని మెట్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే, ట్రాన్సిట్ వారెంట్ లేకపోవడంతో అతడిని తీసుకెళ్లేందుకు కోర్టు అంగీకరించలేదు. వెనక్కి వెళ్లిపోయిన పోలీసులు తాజాగా వారెంట్ కాపీతో మళ్లీ మెట్‌పల్లి వచ్చారు. నిన్న రాత్రి కోర్టులో హాజరు పరిచిన అనంతరం జమ్మూకశ్మీర్‌కు తరలించారు.