సౌదీ రాజు చనిపోయాడంటూ వార్తలు... అవాస్తవమంటూ ఫొటోలు విడుదల... గంటలో 30 శాతం తగ్గిన క్రూడాయిల్ ధర!
- రాజు మరణ వదంతులతో కుదేలైన చమురు మార్కెట్
- ఆయన విధుల్లోనే ఉన్నారంటూ ప్రకటన
- స్వల్పంగా కోలుకున్న సూచీలు
ప్రస్తుతం సౌదీ క్రూడాయిల్ ధర, క్రితం ముగింపుతో పోలిస్తే, రూ. 852 తగ్గి రూ. 2,307 వద్ద కొనసాగుతోంది. ఇది శనివారం నాటి ధరతో పోలిస్తే 27 శాతం తక్కువ. అంతకుముందు 33 శాతం వరకూ ధర పతనమైనప్పటికీ, రాజు బతికే ఉన్నారన్న వార్తలు నష్టాన్ని తగ్గించాయి. మరోవైపు బులియన్ మార్కెట్, తన నష్టాన్ని తగ్గించుకుని, లాభాల దిశగా సాగుతోంది. పది గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి 44,255కు చేరింది.