10th Class: 'అమ్మఒడి' పథకంపై మీ ఫ్రెండ్ కు లేఖ రాయండి... ఏపీ టెన్త్ క్లాస్ ప్రీఫైనల్స్ లో అడిగిన ప్రశ్న ఇది!

questions on government schemes in tenth class pre public exams
షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం ఏపీలో టెన్త్ క్లాస్ ప్రీ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇంగ్లీషు సబ్జెక్టు ప్రశ్నాపత్నంలో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు రావడం చర్చనీయాంశంగా మారింది. అమ్మఒడి పథకం రాష్ట్రంలో ఎలా అమలు జరుగుతోందో చెన్నైలో ఉన్న మీ ఫ్రెండ్ కు లేఖ రాయండి అంటూ ఓ ప్రశ్న అడిగారు. మరో ప్రశ్నలో...  మిమ్మల్ని మీరు ఓ మీడియా ప్రతినిధిలా భావించుకుని మీ స్కూల్లో అమ్మఒడి ఎలా అమలవుతుందో వార్త రూపంలో  రాయండి అంటూ అడిగారు. ఈ రెండు ప్రశ్నలను 5 మార్కుల విభాగంలో ఇచ్చారు. సృజనాత్మక భావవ్యక్తీకరణ విభాగంలో అడిగిన ఈ రెండు ప్రశ్నల్లో ఒకదానికి కచ్చితంగా సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మీడియాలో ఈ అంశం అందరినీ ఆకర్షిస్తోంది.
Go Back to Shorts
10th Class
Pre Public
Amma Odi
English
Letter

More Telugu News