సూర్య సరసన ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Aruva Movie
  • హరి దర్శకత్వంలో మరోసారి సూర్య
  • ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు 
  • దీపావళికి ప్రేక్షకుల ముందుకు
సూర్య అభిమానులంతా ఆయన తాజా చిత్రమైన 'సూరరై పొట్రు' కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తరువాత హరి దర్శకత్వంలో సూర్య 'అరువా' చేస్తున్నాడు. గతంలో తనకి వరుస హిట్లు ఇచ్చిన కారణంగానే సూర్య ఆయనకి  మరో అవకాశం ఇచ్చాడు.

ఇంతవరకూ సూర్యను యాక్షన్ హీరోగానే ఎక్కువగా చూపించిన హరి, ఈ సారి ఫ్యామిలీ ఎమోషన్స్ ను ఎక్కువగా టచ్ చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా రష్మికను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా మాళవిక మోహనన్ పేరు తెరపైకి వచ్చింది. మలయాళ  సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ సుందరి, 'పేట' సినిమాతో క్రేజ్ పెంచుకుంది. ప్రస్తుతం విజయ్ 'మాస్టర్' సినిమాలో నటిస్తోంది. ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్లో షూటింగును మొదలుపెట్టి, 'దీపావళి'కి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
Go Back to Shorts
Surya
Malavika Mohanan
Hari
Aruva Movie

More Telugu News