Jyothula Nehru: టీడీపీ రౌడీయిజం చేస్తే వైసీపీ తట్టుకోలేదు: జ్యోతుల నెహ్రూ

TDP leader Jyothula Nehru warns YSRCP cadre
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తుండగా ఆయన కాన్వాయ్ ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘాటుగా స్పందించారు. లోకేశ్ కాన్వాయ్ ని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.

గోదావరి జిల్లాల్లో వైసీపీ రౌడీ మూకలు చెలరేగిపోతున్నాయని ఆరోపించారు. వైసీపీ రౌడీయిజం చేస్తే టీడీపీ కూడా అదే పంథాలో నడవాల్సి వస్తుందని, టీడీపీ రౌడీయిజం చేస్తే వైసీపీ తట్టుకోలేదని అన్నారు. జక్కంపూడి రాజా రౌడీయిజం చేస్తే ఇక్కడెవరూ గాజులు తొడుక్కుని లేరని హెచ్చరించారు. రాజాకు చేతనైతే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని నెహ్రూ హితవు పలికారు.
Go Back to Shorts
Jyothula Nehru
Telugudesam
Nara Lokesh
East Godavari District
YSRCP

More Telugu News