గడ్డంతో కొత్త లుక్‌లో కనపడ్డ అల్లు అర్జున్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గడ్డంతో కొత్త లుక్‌లో కనపడ్డ అల్లు అర్జున్‌!

Allu Arjun with stylish look
  • కొత్త సినిమా కోసం కొత్త లుక్‌
  • ఓ కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ
  • కొత్త లుక్‌లో కనపడి అభిమానుల్లో జోష్‌ నింపిన స్టైలిష్‌ స్టార్
'అల.. వైకుంఠపురములో' సినిమా ఘనవిజయం సాధించిన జోష్‌లో ఉన్న అల్లు అర్జున్‌ కొన్ని రోజులుగా కొత్త లుక్‌లో కనపడుతూ తన అభిమానుల్లో మరింత జోష్ నింపుతున్నారు. ఆయన తదుపరి సినిమా సుకుమార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకోనుందన్న విషయం తెలిసిందే.

ఇందులో బన్నీ సరసన రష్మిక నటిస్తుంది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం ఆయన కొత్త గెటప్‌ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో స్టైలిష్ స్టార్‌ లుక్‌పై అభిమానుల్లో అమితాసక్తి నెలకొంది.
               మరోసారి మంకీ క్యాప్‌, గడ్డంతో ఆయన కనపడ్డాడు. ఈ సారి బ్లాక్‌ డ్రెస్‌లో కనపడ్డ ఆయన లుక్‌ అభిమానులతో 'అదుర్స్' అనిపిస్తోంది. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యాడు. ఆయన కారులోంచి దిగగానే ఆయన కనపడ్డ లుక్‌కు ఫ్యాన్స్‌ మెస్మరైజ్‌ అయ్యారు.
Allu Arjun
Tollywood
Twitter

More Telugu News