Tamilnadu: సినీనటికి యువకుల నుంచి విపరీతంగా ఫోన్లు, మెసేజ్‌లు.. పోలీసులకు ఫిర్యాదు

gayatri sai filed complaint on phone calls
షార్ట్స్‌లో చూడండి
సినీనటి గాయత్రీ సాయికి వందలాది యువకుల నుంచి విపరీతంగా ఫోన్లు, మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మణిరత్నం తీసిన ‘అంజలి’ సినిమాలో బాలనటిగా నటించిన గాయత్రీ సాయి అందరికీ గుర్తుంటే ఉంటుంది.

ఓ అడల్ట్‌ వాట్సప్‌ గ్రూప్‌లో ఆమె ఫోన్‌ నంబర్‌ను ఎవరో పెట్టారు. ఈ నేపథ్యంలో ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. దీంతో వాట్సప్ గ్రూప్‌లో ఆమె ఫోన్ నంబర్ షేర్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించి, ఆ కంపెనీపై కూడా దర్యాప్తు చేపడుతున్నారు.
                      
నిందితుడు ఇటీవల చెన్నైలోని ఆ నటి ఇంటికి పిజ్జా డెలివరీ చేయడంతో ఆమె ఫోన్‌ నంబర్ అతడికి తెలిసింది. అతడు వాట్సప్‌లో ఆమె ఫోన్‌ నంబర్‌ పెట్టడంతో ఎదురైన వేధింపులకు తట్టుకోలేకపోతున్నానని గాయత్రి రెండు రోజుల క్రితం  ట్వీట్ కూడా చేసి, ఆ యువకుడి ఫొటోను పోస్ట్ చేసింది.

పోలీసులు అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినందుకు ఈ రోజు కృతజ్ఞతలు తెలుపుతూ మరో పోస్ట్ చేసింది. ఫోన్‌ నంబర్లు బయటకు వెళ్లకుండా చూసుకోవాలని పిజ్జా డెలివరి సంస్థ డోమినోస్‌తో పాటు ఇతర కంపెనీలకు ఆమె సూచించింది.
Go Back to Shorts
Tamilnadu
Crime News

More Telugu News