మరో దర్శకుడిని లైన్లో పెట్టిన మెగా హీరో
'డైనమేట్'..'ఆటో నగర్ సూర్య' వంటి చిత్రాల ద్వారా దేవ కట్టా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన తయారు చేసిన కథ కొత్తగా అనిపించడంతో వెంటనే సాయితేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఎమోషన్ తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. సాయితేజ్ లుక్ ను .. ఆయన పాత్రను దేవ కట్టా చాలా విభిన్నంగా చూపించనున్నాడని చెబుతున్నారు. కథానాయికలు .. ప్రతినాయకుడు ఎవరు అనే విశేషాలతో పాటు, మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.