‘ఇండియన్ 2’ షూటింగ్‌లో ప్రమాదం ఎఫెక్ట్: తన సినిమా బృందానికి బీమా చేయించిన శింబు
- 'మానాడు' అనే సినిమాలో నటిస్తున్న శింబు
- 7.8 లక్షల రూపాయలు ఖర్చు చేసిన హీరో
- రూ.30 కోట్ల విలువైన బీమా చేయించిన శింబు
ఆయన ప్రస్తుతం 'మానాడు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా బృందం కోసం 7.8 లక్షల రూపాయలు ఖర్చు చేసి, రూ.30 కోట్ల విలువైన బీమా చేయించాడు. సినిమా కోసం పనిచేస్తోన్న కార్మికుల సంక్షేమం కోసం ఈ బీమా చేయించాడని ఈ సినిమా నిర్మాత సురేష్ కామాక్షి తెలిపారు. దీంతో ఆ సినీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సినిమా యూనిట్ ఇలాగే బీమా తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.