Viral Pics: తల్లి కడుపులోంచి బయటకు వచ్చిరాగానే.. డాక్టర్లను కోపంగా చూసిన శిశువు.. ఫొటో వైరల్‌!

infant expression goes viral
షార్ట్స్‌లో చూడండి
అప్పుడే పుట్టిన శిశువు ఏం చేస్తాడు? అంటే 'ఏడుస్తాడు' అనే సమాధానం చెబుతాం. అయితే, బ్రెజిల్‌లోని రియో డీ జెనెరియోలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన ఓ శిశువు తనకు కనపడిన డాక్టర్లను కోపంగా చూసిన విషయానికి సంబంధించిన ఓ ఫొటో వైరల్‌ అవుతోంది.

ఓ మహిళకు వైద్యులు కాన్పు చేశారు. బిడ్డను బయటకు తీసి, బొడ్డు తాడు కట్ చేస్తోన్న సమయంలో ఆ శిశువు ముఖంలో కనపడిన ఈ హావభావాలకు వైద్యులు కూడా షాక్ అయ్యారు. ఒక నర్సు ఈ ఫొటోను తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఆ శిశువు పుట్టగానే ఏడవలేదు.. దీంతో ఏడిపించడానికి వైద్యులు ప్రయత్నించారు. 'నన్నెవరూ ఏడిపించలేరు' అన్నట్లు ఆ శిశువు కంటి చూపుతో చంపేశాడు. ఆ శిశువు ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు తెలిపారు.

Go Back to Shorts
Viral Pics
Twitter

More Telugu News