Vijay Sai Reddy: వారందరిపై దేశద్రోహం కేసులు పెట్టాలి: విజయసాయిరెడ్డి

vijaya sai reddy fires on yellow media
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో రాజధానులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తీసుకున్న నిర్ణయంపై మీడియాలో వస్తోన్న వార్తలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఇందుకోసం నేవీని కూడా వివాదంలోకి లాగిన ఇటువంటి మీడియాతో పాటు టీడీపీ నేతలపై దేశ ద్రోహం కేసులు పెట్టాలని ఆయన అన్నారు.

'విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని బోగస్ వార్త రాసిన చంద్రజ్యోతి పైన, దాన్ని సమర్థిస్తూ సున్నిత రక్షణ సమాచారాన్ని మీడియా సమావేశంలో బయట పెట్టిన పచ్చ పార్టీ నేతల పైనా దేశద్రోహం కేసులు పెట్టాలి. ఏం బతుకులు మీవి? అమరావతి కోసం నౌకాదళాన్నీ వివాదంలోకి లాగారు' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News