'వైల్డ్ డాగ్' సెట్లో భారీ ఫైట్ చేస్తున్న నాగ్

Wild Dog Movie
  • విభిన్నమైన కథాంశంతో 'వైల్డ్ డాగ్'
  •  ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ గా నాగార్జున 
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి  
కొంతకాలంగా నాగార్జునను సక్సెస్ లు పలకరించడం లేదు. దాంతో ఆయన కొత్తదనంతో కూడిన కాన్సెప్ట్ లపై దృష్టిపెట్టాడు. అలా ఆయన చేస్తున్న సినిమానే 'వైల్డ్ డాగ్'. అహిషోర్ సోలొమన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ గా కనిపించనున్నారు. నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది.

ఇక్కడ వేసిన ప్రత్యేకమైన ఇంటి సెట్లో ఒక భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్లో నాగార్జునతో పాటు సయామీ ఖేర్ కూడా పాల్గొంటోంది. రెగ్యులర్ ఫైట్ సీన్స్ కి భిన్నంగా డిజైన్ చేసిన ఈ ఫైట్ సీన్, ఆడియన్స్ లో ఉత్కంఠను రేకెత్తించేదిగా ఉంటుందని అంటున్నారు. సీక్రెట్ ఆపరేషన్లో భాగంగా నాగ్ చేసే ఛేజింగ్స్ .. ఫైట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని చెబుతున్నారు.
Go Back to Shorts
Nagarjuna
Saiyami Kher
Wild Dog Movie

More Telugu News