దూసుకుపోతున్న 'వి' సినిమా టీజర్
- పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు
- సీరియల్ కిల్లర్ పాత్రలో నాని
- ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు
ముఖ్యంగా నాని డిఫరెంట్ లుక్ కి .. డైలాగ్స్ కి మంచి మార్కులు పడుతున్నాయి. ఇప్పటికే ఈ టీజర్ 3 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టడం విశేషం. ఈ సినిమాలో కిల్లర్ గెటప్ లో తను స్మోక్ చేస్తున్న ఫొటోను పోస్ట్ చేసిన నాని, 'స్మోకింగ్ కిల్స్ .. కానీ కింద స్మోక్ చేస్తున్నవాడు ఇంకా వేగంగా చంపేస్తాడు' అని ఓ సీరియస్ కొటేషన్ పెట్టాడు. ఇలా తన పాత్రకి సంబంధించి నాని మరింత క్లారిటీ ఇచ్చాడు. అమిత్ త్రివేది సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, మార్చి 25వ తేదీన విడుదల చేయనున్నారు.