చంద్రబాబును కలిసి తనయుడి పెళ్లికి ఆహ్వానించిన జయసుధ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబును కలిసి తనయుడి పెళ్లికి ఆహ్వానించిన జయసుధ

Actress Jayasudha Invited Chandrababu for her Son Marriage
  • 26న జయసుధ కుమారుడు నిహార్ వివాహం
  • ఢిల్లీ అమ్మాయి అమ్రిత్ కౌర్ తో నిశ్చయం
  • చెల్లెలు సుభాషిణితో కలసి వెళ్లిన జయసుధ 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ, తన సోదరి సుభాషిణితో కలిసి చంద్రబాబునాయుడి నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. తన కుమారుడు నిహార్ కపూర్ వివాహం నిశ్చయమైందని, పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఫిబ్రవరి 26న నిహార్ వివాహం న్యూఢిల్లీకి చెందిన అమ్రిత్ కౌర్ తో జరగనుందని తెలిపారు. జయసుధ భర్త నితిన్ కపూర్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే.

వైఎస్ సీఎంగా ఉన్న వేళ, ఎమ్మెల్యేగా సేవలందించిన జయసుధ, ఆపై చంద్రబాబు సీఎం అయిన తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Jayasudha
Chandrababu
Nihar
Marriage
Invitation

More Telugu News