ఈ ఏడాది అమరనాథుడిని దర్శించుకోవాలా?... అయితే ఇది మీ కోసమే!
- స్వయంభువుగా వెలిసే మంచు లింగం
- జూన్ 23 నుంచి, 42 రోజుల పాటు యాత్ర
- ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అత్యంత ప్రయాసతో కూడే ఈ యాత్రలో యాత్రికులు, జమ్మూ, పహల్గాం, బల్తాల్ పట్టణాల మీదుగా అమర్ నాథ్ గుహను చేరుకుంటారు. ఈ యాత్ర చేయాలని భావించే వారు డబ్బుతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగివుండాలి. యాత్రపై ఏ క్షణమైనా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి తెగబడవచ్చు. అయితే, యాత్రకు వెళ్లే వారికి భారత సైన్యం పూర్తి రక్షణను కల్పిస్తుంది. ఈ సంవత్సరం 42 రోజుల పాటు కొనసాగనున్న అమర్ నాథ్ యాత్ర, ఆగస్టు 3న ముగుస్తుంది.