Techie: మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య?

  • హాస్టల్ గదిలో ఉరేసుకున్న టెక్కీ
  • ఆమె ఒడిశాకు చెందిన యువతిగా గుర్తింపు 
  • ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తున్నట్టు సమాచారం
A techie suicides in Madhapur

హైదరాబాద్ లోని మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఉంటున్న హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఆమె పని చేస్తోందని, ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆమె పేరు రాజ్యలక్ష్మి అని తెలుస్తోంది. ఈ ఘటనకు గల కారణాలు, వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More Telugu News