రైతు భరోసా పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించిన సీఎం జగన్
- స్పందన కార్యక్రమంపై అధికారులతో సీఎం సమీక్ష
- ఈ నెల 15 నుంచి బియ్యం కార్డుల పంపిణీ
- మార్చి 31 నాటికి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తిచేయాలని ఆదేశాలు
బియ్యం కార్డుల విషయంలోనూ రీవెరిఫికేషన్ పూర్తిచేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి బియ్యం కార్డుల పంపిణీ జరుగుతుందని వెల్లడించారు. అదేరోజున కడప, కర్నూలు, విశాఖ, శ్రీకాకుళంలో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. మార్చి 7 నుంచి చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, ఉభయగోదావరి జిల్లాల్లో, మార్చి 25 నుంచి ప్రకాశం, గుంటూరు, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ఉంటుందని వివరించారు.
మార్చి 31 నాటికి అన్ని జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తిచేస్తామని చెప్పారు. అయితే, 1.41 కోట్ల మందికి క్యూఆర్ కోడ్ కార్డులు ఇవ్వాల్సి ఉండడంతో కాస్త ఆలస్యం అయిందని సీఎం వివరణ ఇచ్చారు. తాము రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నామని వెల్లడించారు.