గత ప్రభుత్వం సంపాదించిన ఆస్తులను అమ్ముతూ పాలిస్తున్నారు: తులసి రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గత ప్రభుత్వం సంపాదించిన ఆస్తులను అమ్ముతూ పాలిస్తున్నారు: తులసి రెడ్డి

  • వైసీపీది రౌడీ పాలన
  • పిచ్చోడి చేతికి ఏకే47 ఇచ్చినట్టుంది
  • 7 నెలల్లో రూ. 35 వేల కోట్ల అప్పులు చేశారు
ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని వైసీపీది రౌడీ పాలన అని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మండిపడ్డారు. పిచ్చోడి చేతికి ఏకే47 తుపాకీ ఇచ్చినట్టు పాలన ఉందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే రూ. 35 వేల కోట్ల అప్పులు చేశారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం సంపాదించిన అస్తులను అమ్ముతూ పాలిస్తున్నారని దుయ్యబట్టారు.

మూడు రాజధానులు అనేది ఒక అవివేకమైన నిర్ణయమని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కోడికత్తి కేసు కానీ, వైయస్ వివేకా హత్య కేసు కానీ తేలలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కార్యాచరణను రూపొందిస్తున్నామని చెప్పారు. పార్టీకి మళ్లీ పునర్వైభవాన్ని తీసుకొస్తామని అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
Tulasi Reddy
Congress
Jagan
YSRCP

More Telugu News