యూత్ కి కనెక్ట్ అయ్యే 'వరల్డ్ ఫేమస్ లవర్' ట్రైలర్
- ఈ నెల 14న 'వరల్డ్ ఫేమస్ లవర్'
- నలుగురు కథానాయికలతో జర్నీ
- డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్న విజయ్ దేవరకొండ
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా .. కేథరిన్ .. ఐశ్వర్య రాజేశ్ .. ఇజబెల్లె లైట్ కథానాయికలుగా నటించారు. ఆ నలుగురు కథానాయికలతో ఆయన సాగించిన జర్నీకి సంబంధించిన విజువల్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ లుక్స్ తో విజయ్ దేవరకొండ చూపించిన వేరియేషన్ బాగుంది. కొత్త ఏడాదిలో తొలి హిట్ కొడతాడేమో చూడాలి మరి.