ఈ అవినీతి ఆయనకు కనిపిస్తున్నట్టు లేదు: జగన్ ను ఎన్.రామ్ కలవడంపై ఐవైఆర్ విమర్శలు
- నిన్న జగన్ నివాసానికి వెళ్లిన హిందూ గ్రూప్ ఛైర్మన్ ఎన్.రామ్
- ఇద్దరూ కలిసి ఒకే కారులో పయనం
- ఇతర సీఎంల కంటే జగన్ పైనే ఎందుకంత అభిమానం అన్న ఐవైఆర్
ఇదంతా పక్కన పెడితే జగన్ ను రామ్ కలవడాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు. 'హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్.రామ్ గారికి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే జగన్ గారిపై ప్రత్యేక అభిమానం. కారణాలేంటో వారి ఇరువురికే తెలియాలి. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని బీరాలు పలికే రామ్ గారికి ఈ అవినీతి కనిపిస్తున్నట్టు లేదు' అని ట్వీట్ చేశారు.