సెలెక్ట్ కమిటీల అంశంపై.. సీఎం జగన్ ని కలిసిన శాసనసభ కార్యదర్శి

  • సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన బాలకృష్ణమాచార్యులు
  • సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అంశం సాధ్యాసాధ్యాలపై చర్చ?
  • ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ
ఏపీ సీఎం జగన్ ను శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో ఈరోజు సమావేశమయ్యారు. మండలి సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అంశం సాధ్యాసాధ్యాలపై చర్చించినట్టు సమాచారం. కాగా, ఏపీ శాసన మండలిలో సెలెక్ట్ కమిటీ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొన్న పరిస్థితుల్లో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా రెండు బిల్లులకు సంబంధించిన సెలెక్ట్ కమిటీల ఏర్పాటు నిమిత్తం టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ లు తమ సభ్యుల పేర్లను ఇప్పటికే మండలి చైర్మన్ షరీఫ్ కు అందజేశాయి.
Go Back to Shorts
Jagan
cm
Andhra Pradesh Assembly
secretary

More Telugu News