ప్రపంచ దేశాలపై కరోనా కాటు... చైనా వెలుపల రెండో వ్యక్తి దుర్మరణం
- మృత్యు ఘంటికలు మోగిస్తున్న కరోనా వైరస్
- హాంకాంగ్ లో 39 ఏళ్ల వ్యక్తి మృతి
- జనవరి 23న చైనా నుంచి వచ్చిన మృతుడు
39 ఏళ్ల వయసున్న ఓ వక్తి గత నెలలో చైనాలోని వూహాన్ కు వెళ్లాడు. జనవరి 23న హాంకాంగ్ కు తిరిగొచ్చాడు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆయన ప్రాణాలు కోల్పోయాడు. హాంకాంగ్ లో మరో 15 కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది.