Chandrababu: ఇదేనా విశాఖకు మీరు చేస్తున్న మేలు?: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల ప్రగతి కోసం టీడీపీ కృషి చేసిందని... ఇప్పుడు అధికార వికేంద్రీకరణ ముసుగులో మూడు ప్రాంతాల మధ్య విద్వేషాలను రగిల్చి రాష్ట్రాన్ని వైసీపీ అగ్నిగుండంగా మారుస్తోందని ఆయన మండిపడ్డారు.

 ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో రౌడీలు కాగడాలు పట్టుకుని తిరుగుతున్నారని అన్నారు. సభ్యత్వం ఇవ్వని క్లబ్బుల భూములకు ఎసరు పెడుతున్నారని... ముడుపులు, వాటాలు ఇవ్వని కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారని, ఖాళీగా కనిపించిన భూములను కబ్జా చేస్తున్నారని... ఇదేనా విశాఖకు మీరు చేస్తున్న మేలు? అని ప్రశ్నించారు.

దేశంలోనే అతి పెద్ద ఎఫ్డీఐ అయిన కియా పరిశ్రమ, గార్మెంట్ ఇండస్ట్రీ, విండ్, సోలార్ పవర్ ప్లాంట్లు తదితర ఎన్నో పరిశ్రమలతో రాయలసీమలో వేలాది మందికి ఉపాధి కల్పించామని చంద్రబాబు చెప్పారు. ఇంత చేసిన తాము ద్రోహులమా? కియా యాక్సిలరీ యూనిట్లను పూణేకు తరిమేసి వేలాది ఉద్యోగాలను పోగొట్టిన మీరు ద్రోహులా? అని ప్రశ్నించారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
YSRCP
Vizag

More Telugu News