Vijay Sai Reddy: ఆ విషయాన్ని ఎల్లో మీడియా, బాబు గ్యాంగ్ ప్రస్తావించడం లేదు: విజయసాయిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి రద్దు నేపథ్యంలో చంద్రబాబు అనుకూల మీడియా తీరును ఆయన విమర్శించారు. అప్పట్లో ఒకలా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

'ఎన్టీఆర్ మండలిని రద్దు చేసిన విషయాన్ని ఎల్లో మీడియా, బాబు గ్యాంగ్ ప్రస్తావించడం లేదు. వైఎస్సార్ గారు పునరుద్ధరించడాన్ని పదేపదే చెబుతున్నారు. చంద్రబాబు 1985, 2005లో రెండు సందర్భాల్లో మండలి ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉపన్యాసం దంచాడు. మీ రెండు నాల్కల ధోరణి వీడియోల సాక్షిగా బయటపడిందిప్పుడు' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Telugudesam
Chandrababu

More Telugu News