కోబ్ ఇక లేడని తెలియగానే నా గుండె పగిలిపోయింది: కోహ్లీ
- హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన బాస్కెట్ బాల్ దిగ్గజం కోబ్ బ్రయింట్
- ప్రమాదంలో కోబ్ కుమార్తె మృతి సహా 9మంది మృతి
- సామాజిక మాధ్యమాల్లో సంతాప సందేశాల వెల్లువ
కోబ్ మృతిపై ట్విట్టర్ మాధ్యమంగా కోహ్లీ స్పందిస్తూ..‘కోబ్ మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. కోర్టులో కోబ్ చేసే విన్యాసాలు చూసి మైమరిచిపోయేవాడిని. జీవితం ఊహించలేనిది. అతడి కుమార్తె కూడా ప్రమాదంలో మరణించిందని తెలిసిన తర్వాత నా హృదయం బ్రద్దలైంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. కోబ్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.