'వి' నుంచి సుధీర్ బాబు ఫస్టులుక్
- ఇంద్రగంటి నుంచి మరో విభిన్న కథా చిత్రం
- కథానాయికలుగా నివేద .. అదితీరావు
- మార్చి 25వ తేదీన విడుదల
'గన్' తో గురిపెట్టిన సుధీర్ బాబు సీరియస్ లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సుధీర్ బాబు లుక్ డిఫరెంట్ గా వుంది. రేపు నాని ఫస్టులుక్ ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రక్షకుడుగా సుధీర్ బాబు .. రాక్షసుడు మనస్తత్వం కలిగిన పాత్రలో నాని చేస్తున్నట్టు ఇంతకుముందే చెప్పారు. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతున్న ఈ సినిమాలో కథానాయికలుగా నివేదా థామస్ .. అదితీరావు కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను మార్చి 25వ తేదీన విడుదల చేయనున్నారు.