Andhra Pradesh: ఏపీ రాజభవన్ లో ఎట్ హోం.. హాజరుకాని చంద్రబాబు, పార్టీ నేతలు!

షార్ట్స్‌లో చూడండి
ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం ప్రారంభమైంది. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయనేతలు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్ షరీఫ్, సీఎం జగన్, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు తదితరులు హాజరయ్యారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు హాజరుకాకపోవడం గమనార్హం.
Go Back to Shorts
Andhra Pradesh
At Home
Governor
Harichandan

More Telugu News