కడప జిల్లాలో ప్రేమ జంట విషాదాంతం
- కొద్ది గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల ఆత్మహత్య
- ఫోన్‌లో గొడవపడిన తర్వాతే ఈ తీవ్ర నిర్ణయం
- పుట్టినరోజునాడే ప్రాణాలు తీసుకున్న యువకుడు
ఆదివారం రాత్రి వీరిద్దరి మధ్య ఫోన్‌లో వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన యోగేంద్ర కుమార్, కడప పట్టణంలోని మృత్యుంజయకుంటలో ఉన్న తన బంధువుల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం అతని పుట్టినరోజు కావడం గమనార్హం. యోగేంద్ర మరణవార్త తెలుసుకున్న హేమశ్రీ హుటాహుటిన చెన్నూరు నుంచి కడపకు వెళ్లి మృతదేహాన్ని చూద్దామని ప్రయత్నించింది. అయితే యోగేంద్రకుమార్ బంధువులు నిరాకరించి తిరిగి పంపించేశారు. దీంతో హేమశ్రీ చెన్నూరులోని వారి ఇంటి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడుతుండగా, కుటుంబ సభ్యులు అడ్డుకుని ఆమెను గదిలో ఉంచి తాళం వేశారు. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక హేమశ్రీ గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకుని ఆమె కూడా ప్రాణాలు తీసుకుంది.
విషయం తెలుసుకున్న పోలీసులు రెండు వేర్వేరు ప్రాంతాలకు చేరుకున్నారు. యోగేంద్ర మృతిపై చింతకొమ్మదిన్నె పోలీసులు, హేమశ్రీ మృతిపై చెన్నూరు పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే ఊరికి చెందిన యువజంట ఇలా ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.