బెంగాల్లో మమత శకానికి ముగింపు.. 12 ఏళ్లనాటి శపథం నెరవేర్చుకున్న అమిత్ షా!
- బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగరేసిన అమిత్ షా!
- ‘ఎవరీ అమిత్ షా?’ అన్న మమతకు ఫలితాలతో సమాధానం!
- పశ్చిమ బెంగాల్లో బీజేపీ చారిత్రక విజయం!
- దశాబ్దాల పోరాటం.. బెంగాల్లో టీఎంసీని గద్దెదించిన బీజేపీ!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. 15 ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పాలనకు తెరపడింది. సోమవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చారిత్రక విజయం సాధించి, రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ గెలుపు రాత్రికిరాత్రే సాధ్యమైంది కాదు. దీని వెనుక దశాబ్దాల క్షేత్రస్థాయి కృషి, పక్కా వ్యూహం, మరీ ముఖ్యంగా పన్నెండేళ్ల క్రితం బీజేపీ నేత అమిత్ షా చేసిన శపథం ఉన్నాయి.
2014 డిసెంబర్లో కోల్‌కతాలో జరిగిన ఒక ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ "‘ఎవరీ అమిత్ షా?’ అని మమతా బెనర్జీ అడిగారు. నేను అమిత్ షా, బీజేపీలో ఒక చిన్న కార్యకర్తను. బెంగాల్ గడ్డపై నుంచి తృణమూల్ కాంగ్రెస్‌ను పెకిలించి వేయడానికే ఇక్కడికి వచ్చాను" అని సవాల్ విసిరారు. అప్పుడు చాలామంది దీనిని తేలిగ్గా తీసుకున్నా, సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ఆయన చేసిన శపథం ఇప్పుడు నిజమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో, నాటి వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయింది.
293 స్థానాలకు గాను జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ 207 సీట్లు గెలుచుకుని, సులభంగా మ్యాజిక్ ఫిగర్ 148ని దాటింది. 15 ఏళ్లు అధికారంలో ఉన్న టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది.
దశాబ్దాల కృషి.. వ్యూహాత్మక ఎదుగుదల
దశాబ్దం క్రితం బెంగాల్లో దాదాపు ఉనికిలోనే లేని బీజేపీ, ఈ స్థాయికి చేరుకోవడం వెనుక అమిత్ షా వ్యూహాత్మక పాత్ర కీలకం. మొదట్లో ‘ఉత్తరాది పార్టీ’గా ముద్రపడిన బీజేపీ, బెంగాలీ సంస్కృతిని, భాషను అర్థం చేసుకోలేదనే విమర్శలు ఎదుర్కొంది. 1982లో కేవలం 0.58 శాతం ఓటు షేర్‌తో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం, 2011 వరకు ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేకపోయింది. కానీ, పట్టువదలకుండా గ్రామాల్లో, బూత్‌ల స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. స్థానిక సమస్యలను అర్థం చేసుకునే నాయకులను తయారుచేసింది.
ఈ వ్యూహం 2016లో ఫలించి 3 సీట్లు గెలుచుకుంది. 2021 నాటికి ఆ సంఖ్య 77కు పెరిగింది. ఇక 2026 ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. చివరి రెండు వారాలు రాష్ట్రంలోనే మకాం వేసి 50కి పైగా ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించారు. సందేశ్‌ఖాలీ హింసాకాండ, అవినీతి, శాంతిభద్రతల వైఫల్యం వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం అమలు, కఠినమైన శాంతిభద్రతల పరిరక్షణ వంటి హామీలు ఓటర్లను ఆకట్టుకున్నాయి. రికార్డు స్థాయిలో 92-93 శాతం పోలింగ్ నమోదు కావడం ఒక ‘నిశ్శబ్ద విప్లవానికి’ సంకేతమని, ఫలితాలు దానిని రుజువు చేశాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక చిన్న కార్యకర్తగా మొదలైన ప్రయాణంలో, తన శపథాన్ని నిలబెట్టుకుని అమిత్ షా బెంగాల్లో కాషాయ జెండాను ఎగరేశారు.